క్రొత్త సంవత్సరం క్రొత్త మనస్సు
2021 నూతన సంవత్సర ఆరాధన గీతం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
క్రొత్త సంవత్సరం దయచేసిన యేసయ్యా
సరిక్రొత్త మనస్సును మాకిచ్చిన యేసయ్యా”2″
నీ దయ కిరీటం మామీద వుంచినావయ్యా”2
వందనం వందనం వందనం యేసయ్య
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”
” క్రొత్త సంవత్సరం “
1) గడచిన కాలంలో మావెంటే వున్నావు
విడువక మాతోడై మము నడిపించావు”2″
ఎన్నో కార్యాములు మాపైన చేసావు
కంటికి రెప్పవలె కాపాడినావు
నీదయ దీవెనలు గత
కాలమంతా కుమ్మరించావు ” 2 “
వందనం వందనం వందనం యేసయ్య
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”
” క్రొత్త సంవత్సరం “
2 ) చేసిన పాపములో నీరక్తము కార్చావు
ఎండిన బ్రతుకులలో నీజీవము పోసావు ” 2 “
శత్రువులపై విజయమును నిచ్చావు
మరణము నుండి తప్పించినావు” 2 “
నీకృప క్షేమములు
మాకు తోడుగా వుంచినావు ” 2 “
వందనం వందనం వందనం యేసయ్య
స్తోత్రము స్తోత్రము స్తోత్రము నీకయ్యా “2”
” క్రొత్త సంవత్సరం “