స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI

Deal Score+1
Deal Score+1

Lyrics:
స్నేహమై, ప్రాణమై వరించే దైవమై
ఇదే జీవితం, నీకే అంకితం
ఇదే నా వరం, నీవే అమృతం
నిరంతరం సేవించనీ

1. జగతిన వెలసి , మనసున నిలచి
కోరె నన్ను దైవము (2)

లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె
పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె

ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ

2. తలపున కొలువై – మనవుల బదులై
చేరె నన్ను నిరతము (2)

కలతలన్నీ కరిగిపోయే – భారమంతా తొలగిపోయే
ఆపదందు క్షేమమాయె – తరిగిపోని భాగ్యమాయే

ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో తరియించనీ

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
christianmedias
We will be happy to hear your thoughts

      Leave a reply

      christian Medias
      Logo