యేసయ్యా నా బంగారయ్యా – Yesaiyya Na Bangaraiyya
యేసయ్యా నా బంగారయ్యా – Yesaiyya Na Bangaraiyya Telugu Christian song lyrics, written tune and sung by Ps. Sudheer Daniel & Ps. Jyotsna Daniel
పల్లవి:
ఊరు లేదు పేరు లేదు
మమ్మును చూచే వారే లేరు (2)
జనాభా లెక్కల్లో అసలే లేవు-2
మాపై దయచూపే వారే లేరు..
(మమ్మల్ని ప్రేమించడానికి ఒకరొచ్చారండి)
యేసయ్యా నా బంగారయ్యా
నన్ను ప్రేమించి వచ్చాడయ్యా(2)
నన్ను ప్రేమించి నాకై ప్రాణమిచ్చి
మళ్ళి తిరిగి లేచి నన్ను లేవనెత్తి..(2)
1.హద్దులే దాటి నాకై వచ్చి
తేడా లేకుండా ప్రేమించాడే (2)
నావారే నన్ను కాదన్నా..
ప్రేమ ధ్వజమును పైకెత్తాడే
ఈలోక దృష్టిలో లేకున్న
యేసయ్య దృష్టిలో శ్రేష్టమే
యేసయ్యా నా బంగారయ్యా
నన్ను ప్రేమించి వచ్చాడయ్యా (2)
2.అందరూ మమ్మును వెలివేసిన
యేసయ్య మమ్మును కావాలన్నాడే
ఆశ్రయమే లేని మాకు
తన హృదయములోనే చోటిచ్చాడే
అడ్రస్సే లేని బ్రతుకులో ఆశ్రయపురమై నిలిచాడే
ఈపాపి జీవితం మార్చేసి
నూతన సృష్టిగా మేము చేసాడే
యేసయ్యా ఈప్రేమేంటయ్యా
కేవలం నీ కృపాయేనయ్యా (2)
నన్ను ప్రేమించి నాకై ప్రాణమిచ్చి
మళ్ళి తిరిగి లేచి నన్ను లేవ నెత్తి..(2)
యేసయ్యా నా బంగారయ్యా
నన్ను ప్రేమించి వచ్చాడయ్యా..(2)
యేసయ్యా నా బంగారయ్యా
నన్ను ప్రేమించి వచ్చాడయ్యా..(4)
Yesaiyya Na Bangaraiyya Telugu Christian song lyrics in English
యేసయ్యా నా బంగారయ్యా lyrics, Yesaiyya Na Bangaraiyya lyrics,Telugu Christian song lyrics
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christian song ‘యేసయ్యా నా బంగారయ్యా – Yesaiyya Na Bangaraiyya’ by Ps. Sudheer Daniel & Ps. Jyotsna Daniel.
- The song expresses themes of love and salvation, emphasizing the unconditional love of Jesus.
- It includes a repetitive structure with a heartfelt plea and acknowledgment of Jesus’ sacrifice.
- Additionally, it offers links to other Telugu Christian songs for further exploration.


