రండి రారండి ఏసయ్య సన్నిధి – Randi Rarandi
రండి రారండి ఏసయ్య సన్నిధి – Randi Rarandi Telugu Christian worship song lyrics, written tune and sung by Sis. Marripudi Shailajja & Nissi John
రండి రారండి ఏసయ్య సన్నిధి
సైన్యములకు అధి పతి యెహోవ సన్నిధి -2
ఉదయ స్తోత్రార్పణలు – దూప నైవేద్యములు
ఆరాధించు స్థలము – ప్రార్థన మందిరము
ఇది రూపాంతర ప్రార్థన మందిరము (రండి రారండి)
1. స్తుతులకు పాత్రుడు – స్తోత్రార్హుడు
యుగయుగములు ఉండు నా యేసుడు
సర్వోన్నతమైన స్థలము
ఇది ప్రభువు నిలిచే మందిరము
ఇది రూపాంతర ప్రార్థన మందిరము (రండి రారండి)
2. మహిమ స్వరూపుడు – తేజార్హుడు
శక్తిగల నామము దివ్య నామము
కన్నీటిని నాట్యముగా మార్చును
నీకు జయము నొసగే మందిరము
ఇది రూపాంతర ప్రార్థన మందిరము (రండి రారండి)
3. ప్రేమ పూర్ణుడు పూజర్హుడు
ముక్తి నిచ్చు నామము యేసు నామము
నీ ప్రార్థన వినే స్థలము
నిన్ను కృపతో నింపే మందిరము
ఇది రూపాంతర ప్రార్థన మందిరము (రండి రారండి)
Randi Rarandi song lyrics in English
రండి రారండి ఏసయ్య సన్నిధి lyrics, Randi Rarandi lyrics, Telugu songs
Key Takeaways
- The article features lyrics for the Telugu Christian worship song ‘రండి రారండి ఏసయ్య సన్నిధి – Randi Rarandi’.
- Written and sung by Sis. Marripudi Shailajja & Nissi John, the song praises Jesus and emphasizes prayer and worship.
- Each verse of the song highlights different attributes of Jesus and the importance of worship in a prayer house.
Estimated reading time: 2 minutes


