తరములు మారినా – Tharamulu Maarina

Deal Score0
Deal Score0

తరములు మారినా – Tharamulu Maarina Telugu Christian Jesus songs lyrics , written tune and voice- Joshua Mandala by. Metropolitan Mission- Bethesda Church

తరములు మారినా
యుగములు గడచినా
మారదు వీడదు ఎన్నడు ఎడబాయదు
నీ ప్రేమ నీ జాలి నీ కృప నా యేసయ్యా

నీ ప్రేమ అమరం – నీ కృప శాశ్వతం
ప్రతికూలతలలో తోడున్న దైవం
నిరాశలో నిస్పృహలో ఓదార్చేను నీ ప్రేమా
లేమిలో బలహీనతలో బలపరచెను నీ కృపా
నీ ప్రేమ నీ జాలి నీ కృపా నా యేసయ్యా ॥2॥

నీ వాత్సల్యం తరగదు నిత్యం
శ్రమలోన ధైర్యం బలమైన దుర్గం ॥2॥
అగ్నిలో జలములలో తోడున్నది నీవేగా
పోరులో పోరాటములో నా పక్షము నీవేగా
నీ ప్రేమ నీ జాలి నీ కృపా నా యేసయ్యా

నీ సిలువ త్యాగం నను మార్చిన వైనం
ఆ కలువరి కొలిమి నాకిచ్చెను బలిమి II2II
పాపినై దూరమైనను వెంటాడెను నీ ప్రేమా
దోషినై నిలిచి ఉన్నను నా నీతి నీవేగా
నీ ప్రేమ నీ జాలి నీ కృపా నా యేసయ్యా ॥2॥

తరములు మారినా song lyrics, Tharamulu Maarina song lyrics, Telugu jesus song lyrics

Tharamulu Maarina song lyrics in English

Key Takeaways

  • The article features lyrics for the Telugu Christian song ‘తరములు మారినా – Tharamulu Maarina.’
  • It emphasizes themes of divine love, support in adversity, and spiritual resilience.
  • The song expresses gratitude for God’s everlasting love and grace through powerful imagery.
  • Links to additional Telugu Christian songs and relevant Bible study resources are included.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo