దావీదు పురములో దేవూడు జన్మించె-DAVEEDU PURAMULO
LYRICS
దావీదు పురములో దేవూడు జన్మించె
లోక రక్షకుడు దివి నుండి దిగివచ్చే” 2″
రారండి వేగమే వేడుక చూద్దాం సంతోష గానముతో నాట్యం చేద్దాం “2”
దావీదు పురములో
……యేసయ్యా
1. దైవ దూత సందేశమిచ్చెను – ప్రవక్తల వచనం నెరవేర్చవచ్చెను
తూర్పు దేశపు జ్ఞానులే వచ్చెను –
గొల్లలంతా కూడి స్తుతియించ వచ్చెను
రారండి వేగమే వేడుక చూద్దాం
బంగారం సాంబ్రాణి అర్పించెదము “2”
దావీదు పురములో
……యేసయ్యా” 2″
2.కన్య మరియ గర్భాన పుట్టెను
నరరూపాన్ని ధరియించి వచ్చెను
పాపులను రక్షించ పరిశుద్ధుడే వచ్చేను లోకాన్ని విడిపించ రక్షకుడే వచ్చేను
రారండి వేగమే వేడుక చూద్దాం
పాపుల రక్షకున్ని దర్శించేద్దాం “2”
దావీదు పురములో….
3.బాలుడు కాదయ్యా బలవంతుడు యేసయ్య నరుడు కాదయ్యా దైవ కుమారుడయ్యా
నరకాన్ని తప్పించ దివి నుండి వచ్చాడయ్యా సాతాన్ని జయించిన విజయ శీలుడయ్యా
రారండి వేగమే వేడుక చూద్దాం
రారాజుని ఘనపరిచి కీర్తించెదము ” 2″
దావీదు పురములో…..