కీర్తించరే – Keerthincharee Telugu christmas song lyrics

Deal Score0
Deal Score0

కీర్తించరే – Keerthincharee Telugu christmas song lyrics, written Tune & Singing by Kaluvala Srinivas Adhenu Swaram Ministries

పల్లవి:

కీర్తించరే రాజును కీర్తించరే- కొనియాడరే యేసును కొనియాడరే
నింగిలో ఒక తార మెరిసిపోతుంది -రక్షకుడు పుట్టెనని కనువిందు చేసింది –
గగనవీధుల్లోన సందడి చేసింది -పరిశుద్ధ ప్రభువుకు స్వాగతమే పలికింది -(2)

కీర్తించరే రాజును కీర్తించరే- కొనియాడరే యేసును కొనియాడరే

  1. చరణం :

మహిమగల మహారాజు – ముద్దులొలికించే మురిపాల బాలుడు
కన్య మరియా నిన్ను కడుపునమొసి – పునితురాలయింది
అద్వితీయారూపుడు అతి సుందరుడు – పాపమన్నది లేని పరిశుద్ధుడు -(2)
లోకాలనేలే లోకరక్షకుడు ఉఉఉఉ -(2)
పశులశాలలోన పవళించినాడు

కీర్తించరీ రాజును కీర్తించరే – కొనియాడరే యేసును కొనియాడరే

  1. చరణం :

దవలవర్ణుడు రత్నవర్ణుడు – రవి కోటి తేజు
పాప శాపమును తొలగించ నేడు – భువిలోకి ఏతించెను
కరుణగలవాడు కరుణామయుడు – దయగలవాడు దయామయుడు (2)
రాజులకు రాజుగా రానైయూన్నాడు ఉఉఉఉ (2)
పరిశుద్ధులందరిని కొనిపోతాడు

పల్లవి:

కీర్తించరే రాజును కీర్తించరే – కొనియాడరే యేసును కొనియాడరే
నింగిలో ఒక తార మెరిసిపోతుంది – రక్షకుడు పుట్టేనని కనువిందు చేసింది
గగనవీధుల్లోన సందడి చేసింది – పరిశుద్ధ ప్రభువుకు స్వాగతమే పలికింది (2)

కీర్తించరే రాజును కీర్తించరే యేసును కొనియాడరే

కీర్తించరే song lyrics, Keerthincharee song lyrics, Telugu Christmas

Keerthincharee song lyrics in English

Key Takeaways

  • The article features the lyrics to the Telugu Christmas song ‘కీర్తించరే – Keerthincharee’.
  • The song praises Jesus, highlighting His divine attributes and the joy of His birth.
  • The lyrics include multiple verses and a catchy refrain celebrating the Savior’s arrival.

Estimated reading time: 2 minutes

The Lyrics are the property and Copyright of the Original Owners Lyrics here are For Personal and Educational Purpose only! Thanks .
god medias
      christian Medias - Best Tamil Christians songs Lyrics
      Logo