Telugu Christmas Song 2023||Chukkallo|| NITYA SANTOSHINI|| KENNY CHAITANYA
Telugu Christmas Song 2023||Chukkallo|| NITYA SANTOSHINI|| KENNY CHAITANYA
*HAPPY CHRISTMAS TO ALL*
#Nityasantoshini
#kennychaitanya
#TeluguChristmasSongs2023
Lyrics and Music Director :
Dr Kenny Chaitanya Bantumilli
Singer :Nitya Santoshini
Flute : Pramod Umapathi
Indian Percussions : Anil Robin
Rhythm Programming : Sharon Raavi
Mixed & Mastered : Cyril Madiri
Recorded@
Vemula Studios Hyd
Kenny Studios Pro Hyd
Recordist Ramesh
Video Editing :
Prasad T
FaithPost Production Hub
Special Thanks To Bro Sam K Kiran
*___________________________________*
చుక్కల్లో క్రొత్త చుక్కే పుట్టేనంట
వింతల్లో క్రొత్త వింతే జరిగేనంట. ||2||
రాజులకే రారాజు ప్రభువులకే ప్రభువు
తండ్రి మాటకై తలయొగ్గి తనకు తానై తగ్గి
మనుష్యుల మార్చ
వ్యధలను తుంచ
కన్యమరియ గర్భమునే ఎంచి
పరిశుద్దుడుగా కదిలేనంట
అనుపల్లవి
పరలోకం విడిచి లోకాలు దాటి
భూలోకం వచ్చేనంట
దివినేలే రాజు భువినేల మనకై
కడుబీదై పుట్టేనంట ||2|| ||చుక్కల్లో క్రొత్త ||
చరణం 1
ప్రవక్తల ప్రవచనం నెరవేర్చులా
పరిశుద్ధుడేసు జన్మించెగా
ప్రపంచపు ప్రజలను రక్షింపగా
యెహోవా తన సుతుని పంపించెగా ||2||
మనుష్యుల మనసులు మార్చుటకు
మహిమలో మనలను చేర్చుటకు
మాదిరి మనలకు చూపగను
తనదరి మనలను చేర్చగను
రక్షణ నిలుప రాకడ తెలుప
రవితేజముగా భువికొచ్చెను ||పరలోకం విడిచి||
చరణం 2
తారచే త్రోవను తెలుసుకుని
స్తుతియించిరే ఘనులే యేసుని
దూతే తెలుపగ కాపరులకు
పరుగిడిరే చూడ ప్రియబాలుని ||2||
పశుహృదయులను మార్చుటకు
పసివానిగా ప్రభు దిగివచ్చెను
సిలువలో శ్రమలను మోయగను
శిరస్సును వంచి సహించగను
సువార్త తెలుప వధువుగ నిలుప
నూతనవరుడుగా కొనిపోవను ||పరలోకం విడిచి||
Telugu Christian songs lyrics