బాద్షా – Baadsha Telugu Christmas song lyrics
బాద్షా – Baadsha Telugu Christmas song lyrics, Written Tune & Music by Ps. George Muller
పల్లవి :
మకుటము విడిచిన మహా రాజు
మనలను ప్రేమించెను
శిక్షను తప్పించి రక్షింపను
ధరణికి అరుదించెను (2)
అను పల్లవి :
సారే దునియాకో బాద్షా ఏకి హే వో జీషు మస్సీ హెన్
Sing unto the Lord A new song
For He is our only King
సారే దునియాకో బాద్షా ఏకి హే వో జీషు మస్సీ హెన్
Sing unto the Lord A new song
For He is our only King
చరణం 1 :
రాజులు, తూర్పు జ్ఞానులు
ప్రణమిల్లిరి రా రాజు ఎదుటే
హా పశు సాల యే, రాజ పురమాయెను
రక్షకుని జననముతో (2)
తర తరాల నిరీక్షణ నిజమాయెను
యేషాయి మొద్దు చిగురించెను
కొండ కోన లోయలన్నీ సందడి చేసెను,
ఊరు వాడ వీధులలోన పండుగ వచ్చెను
నింగి నేల సంద్రాలన్నీ మురిసిపోయెను
పొలము పల్లె పట్నాలన్నీ మెరిసిపోయేను
అనుపల్లవి :
సారే దునియాకో బాద్షా ఏకి హే వో జీషు మస్సీ హెన్
Sing unto the Lord A new song
For He is our only King
చరణం 2 :
కాపరులు, మరియ యోసేపులు
పరవశించిరి దూత వార్తతో
హా తారయే, దారి చూపెను
అ బెత్లహేము పురమునకు (2)
మన పాపపు కట్లన్నీ త్రెంచి వేసెను
ఈ దైవ తనయుడే
చీకటి రేయి వెలుగుతో నిండి మెరిసిపోయెను
తూర్పు తారే త్రోవను చూపి సందడి చేసెను
ఆ తారలన్నీ నాట్యము చేసి పండుగ చేసెను
దూతలన్నీ గానము చేసి మురిసిపోయెను
అనుపల్లవి :
సారే దునియాకో బాద్షా ఏకి హే వో జీషు మస్సీ హెన్
Sing unto the Lord A new song
For He is our only King
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article presents the lyrics of the song ‘బాద్షా – Baadsha’, a Telugu Christmas song.
- The song emphasizes the love and sacrifice of Jesus as the King.
- It includes verses celebrating the birth of Jesus and the joy it brings to the world.
- The song features various elements of celebration and worship, invoking themes of light and hope.


