పుడమంతా పులకించె – Pudamantha Telugu Christmas song lyrics, written tune and sung by A.R.Stevenson
పుడమంతా పులకించె ఉల్లాసంగా
మనసున్న మహరాజు జన్మించంగ
దివ్యరూపి యేసు మేను ధరియించంగ
వేడుకలు జరగాలి ఉత్సాహంగా
అ.ప. సంతోషిద్దాం సందడి చేద్దాం
రాజును పూజించి తరిద్దాం
1. లోకాన్ని ప్రేమించి ప్రాణప్రదంగా
పుత్రుణ్ణి పంపించె తండ్రి స్వయంగా
ప్రాణాన్ని పెట్టి లేవంగ
రక్షకుడే దీనుడుగా రాగా పండుగ
2. పరలోక సైన్యాలు కూడి ఘనంగా
స్వరమెత్తి స్తోత్రాలు పాడె ప్రియంగా
సంతోష వార్త చాటంగ
గొల్లలకు దర్శనము కాగా పండుగ
3. ఆకాశ వీధుల్లో కొత్తదనంగా
తారొకటి వెలిగింది కాంతిమయంగా
జ్ఞానులకు దారి చూపంగ
బాలునికి కానుకలు తేగా పండుగ
Pudamantha Song lyrics in English
పుడమంతా పులకించె lyrics, Pudamantha lyrics, Telugu songs
Estimated reading time: 2 minutes
Key Takeaways
- The article discusses the Telugu Christmas song ‘పుడమంతా పులకించె – Pudamantha.’
- It includes the lyrics written and sung by A.R. Stevenson.
- The song expresses joy and celebration surrounding the birth of Jesus.
- Several stanzas highlight themes of love, divinity, and festivities.


